Friday 18 February, 2011

ప్రపంచం సౌందర్యమయం



ఏ మాత్రం కళ్ళు కల వాడికైనా ఈ ప్రపంచం సౌందర్యమయం గా కనపడక మానదు.
ఒక్కొక్క జ్ఞానేన్ద్రియాన్ని మేల్కొలిపి..రంగులతో, స్వరాలతో రుచులతో, పరిమలాలతో ముదు స్పర్శలతో, అభిరుచులతో,కళలతో, ప్రేమతో,సంతోషంతో, భావోద్రేకాలతో.. రక రకాల ఆనంద పెట్టాలని చూస్తుంది. తనని తన సౌందర్యాన్ని చూసి అనుభవించి సుఖించమని, బ్రతిమిలాడి పిలుస్తున్నట్టు నిద్ర నిచి, మత్తు నుంచి లేపి ఎదురవుతుంది. ఆకలేస్తే భోజనం అడుగుతాము, దాంటో రుచిని కలిపింది. కామం తీర్చుకోవాలని బుద్ది పుడితే దాంటో ప్రేమనీ, అందాన్ని చేర్చింది.
తోవ కనపడితే చాలు అనుకుంటే పక్కనే చెట్లని పువ్వుల్నీ పెట్టింది.గొంతుకలో మర్ధవాలు, రుచులలో పరిమళాలు, ఆకాశంలో లో నునుపు, గాలిలో మృదుత్వం, వెన్నెలలోని నిర్మలత్వం నీళ్ళలోని చల్లదనం అన్నీ. నత్త గుళ్ళలో, గడ్డి పువ్వుల్లో, కీటకాల నడకల్లో, పక్షి రెక్కల వొంపుల్లో సౌందర్యాన్ని ఊరికే గుమ్మరిస్తుంది. 

పుట్టినప్పటినుండి ప్రతి జీవిని, ఏ లోకం తన వొళ్లోకి తీసుకొని సుఖపెట్టాలని చూస్తుంది. పిల్లలకి సదుపాయం చేయటం కోసమై తల్లి హృదయంలో ప్రేమ, స్థనంలో పాలు, అ పాలలో మాధుర్యము, తోడల్లో మెత్తదనము, పొట్టలో ఆకలి, నోటిలో రుచి ఇవన్నీ ఏర్పరుస్తుంది సృష్టి 

No comments: