Thursday, 11 December, 2008

ఈ నాడు ఈ దేశం లో...

ఈ నాడు ఈ దేశం లో ఎలాగైనా ధనం సంపాదించే మార్గమే ధర్మ మార్గమైంది.
డబ్బు పేరు సంపాదించిన స్త్రీలు తమ సంసారమెట్ల ఉన్నాసరే సంఘంలో యోగ్యులైనారు.
తెల్లారి లేస్తే ఉరుకులు, పరుగులు, ఉద్యోగాలు డబ్బులు , ఇవ్వన్నీ వదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే మనో వ్యవధి, పువ్వులనుంచి, ఆవులనించి, అతితులనించి, ఇతలురాల్ ఆకలి తీర్చడం నుంచి వచ్చే సంతోషం ఉత్సాహం, శాంతి ఎప్పుడు కలుగుతుందో ఈ మానవులకి.. -chalam

మనిషి.

"సౌఖ్య మివ్వడానికి ధనము ఆస్తి ముఖ్యమనుకున్నంత కాలం ఇంకా ఏ విలువకీ స్ట్లముండదు మనుషుల మనస్సులో , తనను సృష్టించిన మన్ను తోటి, తన కళ్ళు తెరిచిన కాంతి తోనూ సంభందానికి దూరమవుతున్నాడు మనిషి."-chalam

వాటికీ నాకు ఏదో భందుత్వం


"ఎటు చూసినా నీలపు ఆకాశం, కొండలు, పచ్చని చెట్లు,, ఆకాశం కేసి చేతులు చాచే మైదానాలు.."
"ఆరు బయట చక్కని బంగారపు ఎండలో తళతళ లాడే ఏటి చల్లని నీళ్ళు.. తెల్లని ఇసిక... చిన్ని అలలు నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడటం, తమాషా రంగుల పిట్టలు వచ్చి తొంగి చూసి , చిన్ని చిన్ని పలుకులు ఈలలు ,, ఆ ఆకుల గుహల్లోంచి పలికేవి.ఆ పక్షి రెక్కలోంచి ఒక ఈకే నామీద  వచ్చి వాలేది సోమరిగా, "
"ఆ పిట్టలన్ని నాకు గుర్తు, ప్రతి మధ్యాన్నం ఎదురు చూసేదాన్ని వాటికోసం, వాటికీ నాకు ఏదో భందుత్వం ఉన్నట్టు తోచేది. కొంగల బారు నా తల మీద నుండి వెడుతూ నా ఒంటరి తన్నాన్ని గుర్తు చేసింది..."- చలం

మనం వివేకవంతులం ఐతే

"ప్రపంచం అంతా ఆనందం పొంగి పొర్లుతూ ఉంది .దాన్ని అందుకో కలిగిన హృదయాలు ఉండాలి.ప్రతి జీవికీ కొంత శక్తి ఉంది.కొంత సమయం ఉంది ఈ శక్తిని కాలాన్నీ ఆనందంలో మార్చుకొనే తెలివితేటలు లేవు. మనం వివేకవంతులం ఐతే మన శక్తినంతా ఆనందంగా మార్చుకోగలం. మన కాలాన్ని మనకి ఆనందాన్ని ఇచ్చేలా చేయగలం. ఈ శక్తి పుట్టుక వల్లా, సంస్కారం వల్లా, అలవాట్ల వల్లా, మనకి మనం ఇచ్చు కునే శిక్షణ వల్లా కలుగుతుంది.
ఎవరు చెప్పినా వినకుండా తన స్వభావాన్ని ఇన్ స్టింక్ట్ ని నమ్ముకుంటే ఎ మనిషికి ఏది తనకి ఆనందమో అర్థం అవుతుంది. భాదని ఎదురించి పోరాడితే చాలావరకు లొంగుతుంది.కాని ఆ జ్ఞానము కొద్ది మందికే ఉంది.లోకం సౌందర్యాన్ని కల్పిస్తుంది కానీ అనుభవించమని బలవంత పెట్టగలదా?? అట్లానే జీవితం కష్టాలని కల్పిస్తుంది కానీ అనుభవించమని బలవంత పెట్టలేదు."

ఆనందం


తనకి బాధ కలిగించే పనులనుండి మన శరీరం తనంతట తనే తప్ప్పుకుంటుంది..
కానీ మనసుకి మాత్రం అ నేర్పు ఇంకా రాలేదు..తనకి ఏది అనడం ఇస్తుందో.. ఆ బాధల ఎట్లా నుంచి తప్పుకోగాలరో మనుషులు ఇంకా నేర్చుకోలేదు.కనకనే ఎవడు వచ్చి " ఆనందం " అని కేకలు వేసినా వాడి వెంట పరిగెత్తుతారు..


నాకు ఆనందం కావాలి ,, నేను ఆనందం అనుభవించాలి అని ప్రయత్నిస్తే ఆనందం వచ్చేట్టు కనపడదు..
ఒక కార్యం ద్వారానే కల్గుతుంది ఆనందం.. మనసు ఆ కార్యం మీదనే ఉండాలి కానీ ఆనందం మెడ ఉంటె ఆనందం చెదిరిపోతుంది..తీపి కావాలన్నా వాడు తీపి కోసం వెతికితే ఎక్కడన్నా కనపడుతుందా .. చెరుకు కోసం వెతకాలి కాని..
ఒక యోగి వచ్చి ఆసనం చుఇపగానే అందరు ఆసనాలు ప్రారంభిస్తారు.. ఇంకో పండితుడు వచ్చి జుట్లు కోరిగించ మనగానే అందరు జుట్లు గోరిగిస్తారు..
ఉద్యోగం చేస్తూ ఎన్నడు నవ్వని దురదృష్ట వంతుడు..ప్లేదరై కవుల వెంట తిరిగే రసికుడు.. పెళ్లి చేసుకొని నమ్మకంగా నిలువ లేని స్త్రీ ... ఇలా అందరూ తమ అనడమేదో తెలియని మూర్కులు..
తమకి లేని వొస్తువ తమకి ఆనందం ఇస్తున్డను కోవటం పెద్ద భ్రమ..

విరోధం సహజమే..!

"మనసు మారకుండా ఆత్మ అభివృద్ధి చెందకుండా ప్రపంచం అంటే అర్థం కాకుండానే ఏవో కొన్ని కర్మల వల్లా.. పూజల వల్లా యోగాల వల్లా దేవుడి దయ సంపాదించ వచ్చుననే నమ్మకం ఈ మనుషులకి.. ప్రపంచంలో ఈ గొప్ప విషయము అర్థం కాని ముర్ఖుడికి ఈశ్వర జ్ఞానం కల్గుతుందట.. ఈ దేశం చాల ఉన్నతమైన దని ఏ లోపాలు లేవని , ఈ ఆచారాలన్నీ చాల వివేకంతో స్థాపించినవనీ, అంతరార్థలున్నాయని కీర్తిస్తే .. మయజోల పాడి జో కొడితే చాల సంతోషం ఈ ప్రజలకి. ఇంకా ఆనందంగా, ఆరోగ్యంగా బ్రతకటానికి మార్గాలున్నయనీ చెపితే విరోధం సహజమే." -chalam

జీవితం స్వప్న మైతే ..!!

జీవితం స్వప్న మైతే , సుందరమైన స్వప్నాన్నే కందాం. ఈ దరిద్రం లోంచి ఈ భయం లోంచి మేలుకుందాం.- చలం

డబ్బు సంస్కారం

సంస్కారమంటే ...ఈనాడు డబ్బు సంస్కారం తప్ప ఇంకోటి లేదు , తనకో ఆత్మ ఉందని మరిచి పోయినాడు మానవుడు. struggle for existance. ప్రకృతిలో- చెట్లలో- కీటకాలలో ఎట్లా ఉంది అంటారో అదే మనుషుల్లో ఈనాడు. వాటికి శాంతి ఉంది అది లేదు మానవుడికి.- chalam

మతమంటే

మతమంటే మనసుకి కలిగే గొప్ప సందేహాలు తీర్చాలి , మన జీవనానికి నమ్మకానికి సమన్వయము కుదిరించాలి.లోకం లో కొత్త సమస్యలు బయలు దేరితే వాటిని అర్థం చెయ్యాలి. నుతనోస్థం ఇవ్వాలి జీవించడానికి. అంతే కాని ఏదో నేను చెపుతున్నాను , నమ్ము. నమ్మితే మోక్షం ,, నమ్మక పోతే నరకం.. నా పాణి పరలోకం ఈ లోకం తో పని లేదు అనే మతం ఎందుకు పనికి రాని మతం..
ఇన్ని ఆచారాలతో ఈశర నామాలతో ప్రతిమూలా మరుగుతో ఉండే ఈ దేశం లో ఈ పూజలు , మల్లు ముక్కులు ముసుకోదాలు , వేదాంతాలు మాట్లాడే వాళ్ళు. రుద్రస్కల వాలు.. విభూతుల వాళ్ళు..వీళ్ళని ప్రశ్నిస్తే ,, ఏదో శాస్త్రం .. అవతారం..కరం అని గొణగడం తప్పిస్తే ఈ సందేహాలు తీర్చరేం ..?? ఎందుకు ఈ ఆద్యాత్మికం ,, ఈ భజనలు భాష్యాలు భగవత్గీతలు అంత గోపా పుస్తకాలేమో వేళ్ళకి ఎవరికీ తెలిసినట్టు కనపడదు. మతానికి జీవితానికి ఈ సంభందం లేదు . దెయ్యాలు ఆత్మలు పరలోకం ఈశ్వరుడు కరం పాపం. పుణ్యం. ఇట్లాంటి విషయమై ఒక్కరికి నిష్టితాభిప్రాయం లేదు. -chalam