Friday, 9 July, 2010

దైవానికి ఒక బుద్ధి , ఒక న్యాయమూ , విచక్షణా ఉన్నాయేమో అన్న సందేహమన్నా రాదు.

సంస్కారమంటే ఈనాడు డబ్బు సంస్కారం తప్ప ఇంకోటి లేదు , తనకో ఆత్మ ఉందని మరిచి పోయినాడు మానవుడు. struggle for existance. ప్రకృతిలో- చెట్లలో- కీటకాలలో ఎట్లా ఉంది అంటారో అదే మనుషుల్లో ఈనాడు. వాటికి శాంతి ఉంది అది లేదు మానవుడికి.
ధనాలు అధికారాలు సంపాదించిన వారు కొద్దిమందే. కాని ప్రతి వాడికి దాని మీదే మోజు అదే ప్రయత్నం. అందరికి సుఖాలే ముఖ్యం. మానవుడి మీద ప్రేమా , మానవోద్దరణ అంటే , ప్రతి వాడికి కారు, టెలివిజన్ సప్లై చేయటమని అర్థం.. ధనం తో దురవస్థలో పడే వారు కొద్ది మంది. అది లేదే దాన్ని ఎట్లా సంపాదిద్దామా అని పగ పొందే వారు వేలకువేలు. ధనం వుండనీ, వుండకపోనీ, ప్రతి వారి ద్రుష్టి దాని మీదే .. ప్రతి వారి ఆశా , ఆశయము ధనమే.
సుఖమంటే, డాబు ఇతరులు తనని ఆశ్రఇంచడము తను అజ్ఞాపించడమూ,మిత్రులూ, కబుర్లూ,కోతలూ ఇవే చూసుకుంటాడు పైకి. కాని ఈ గొప్పల వెంట, చచ్చేపని , జాగ్రత్త, కుట్ర, ఇతరులని కూల్చడాలు , అబద్దాలు అన్ని ఇష్ట పడతాడు అందువల్లనే ఇంత అశాంతి పెరగడం. ఎందుకైనా మంచిదని తనకి సహాయం చేయటం కోసం పూజలు చేయిస్తాడు. పడిపోయేట్టు ఉన్న దేవుడిని తలచుకొంటాడు. తిరపతికి పోతూ ఉంటాడు. దైవాన్ని తన వైపు చేర్చు కుంటాడు దైవానికి ఒక బుద్ధి , ఒక న్యాయమూ , విచక్షణా ఉన్నాయేమో అన్న సందేహమన్నా రాదు.
ఇంకా మొక్కులతో సాధిస్తాడు , దురదృష్టం వచ్చేటట్టు కనపడిందా! " నన్ను నిలబెదితివా నేను వంద రూపాయలిస్తాను, తిరపతి వెంకటేశ్వరా! నాకు లక్ష ఇవ్వు .. నీకు వెయ్యి ఇస్తాను. నీకు నగ చేయిస్తాను. నీ గుడి చుట్టు పొల్లిగింతలు పెడతాను " అంటాడు.
ఈ బెరాలకి ఈశ్వరుడు ఒప్పుకుంటాడనే భ్రమ. భక్తి అనేది ఏ koshaanaa లేదు..ఉట్టి బేరాలు. ఈశ్వరుణ్ణి కూడా టోపీ వేద్దామనే, ఈమ ఘోరాలు చేస్తేనేం , ఆ దేవుడి మొహాన డబ్బో , జుత్తో , సంతర్పనో సహస్రనామార్చానో కొడితే సరి! 

నేల మీదకి రా....

ఎక్కడయితే రైతు గట్టి నేలని దున్నుతున్నాడో ,, ఎక్కడ బాట వేయటానికి కూలీలు రాళ్ళు కొడుతున్నారో.. అక్కడ ఈశ్వరుడు , ఎండలో వానలో..దుమ్ముకోట్టిన బట్టలతో వాళ్ళ మధ్య తిరుగుతున్నాడు. నీ మడి బట్టలు పక్కన పెట్టి అతని వలెనె నీవు దుమ్ము నేల మీదకి రా.. (గీతాంజలి )

bitch goddess of success

మనిషి , ఈశ్వరున్ని తొలగించి దానిపై bitch goddess of success ని ప్రతిష్టించి ఆమె ముందు తమ లోని ఉన్నతమైన విలువలని నిత్యము బలి సమర్పణ చేస్తున్నాడు "
ధనం పోగు చేసుకోడము, దాంతో తిండినీ, స్త్రీ ని కొని అనుభవించడము, తన సోదరులపై అధికారము ఆశయం గా పెట్టుకొని, ఎన్ని పై పై ఆడంబరాలు మోస్తే అంత ఘనత .

Sunday, 30 May, 2010

నవీన స్త్రీ

అత్త అధికారం నుంచి, భర్త అధీనం నుంచి తప్పించుకున్న నవీన స్త్రీ , షోకులకీ, సంఘ గౌరవానికీ, ఫాషన్ కి బానిస అవుతోంది. ఒక పురుషుడి నీడ కింద నిల్చొని ( ఆ పురుషుడికి బానిస అయితేనేం గాక ) లోకాన్ని దిక్కరించగలిగే ఇల్లాలు, ఈనాడు సంఘ గౌరవం పేర, విద్య ఉద్యోగం పేర,ఫాషన్ పేర, వెయ్యి మందికి దాస్యం చేస్తోంది.. నవీన స్త్రీకి తన చుట్టూ ఉన్న స్త్రీలందరూ అత్తలైనారు..