Friday, 18 February, 2011

ప్రపంచం సౌందర్యమయంఏ మాత్రం కళ్ళు కల వాడికైనా ఈ ప్రపంచం సౌందర్యమయం గా కనపడక మానదు.
ఒక్కొక్క జ్ఞానేన్ద్రియాన్ని మేల్కొలిపి..రంగులతో, స్వరాలతో రుచులతో, పరిమలాలతో ముదు స్పర్శలతో, అభిరుచులతో,కళలతో, ప్రేమతో,సంతోషంతో, భావోద్రేకాలతో.. రక రకాల ఆనంద పెట్టాలని చూస్తుంది. తనని తన సౌందర్యాన్ని చూసి అనుభవించి సుఖించమని, బ్రతిమిలాడి పిలుస్తున్నట్టు నిద్ర నిచి, మత్తు నుంచి లేపి ఎదురవుతుంది. ఆకలేస్తే భోజనం అడుగుతాము, దాంటో రుచిని కలిపింది. కామం తీర్చుకోవాలని బుద్ది పుడితే దాంటో ప్రేమనీ, అందాన్ని చేర్చింది.
తోవ కనపడితే చాలు అనుకుంటే పక్కనే చెట్లని పువ్వుల్నీ పెట్టింది.గొంతుకలో మర్ధవాలు, రుచులలో పరిమళాలు, ఆకాశంలో లో నునుపు, గాలిలో మృదుత్వం, వెన్నెలలోని నిర్మలత్వం నీళ్ళలోని చల్లదనం అన్నీ. నత్త గుళ్ళలో, గడ్డి పువ్వుల్లో, కీటకాల నడకల్లో, పక్షి రెక్కల వొంపుల్లో సౌందర్యాన్ని ఊరికే గుమ్మరిస్తుంది. 

పుట్టినప్పటినుండి ప్రతి జీవిని, ఏ లోకం తన వొళ్లోకి తీసుకొని సుఖపెట్టాలని చూస్తుంది. పిల్లలకి సదుపాయం చేయటం కోసమై తల్లి హృదయంలో ప్రేమ, స్థనంలో పాలు, అ పాలలో మాధుర్యము, తోడల్లో మెత్తదనము, పొట్టలో ఆకలి, నోటిలో రుచి ఇవన్నీ ఏర్పరుస్తుంది సృష్టి 

Tuesday, 15 February, 2011

త్యాగం


శ్రీరాముడు అడవికి పోతే దానిని ధర్మం అన్నారు, త్యాగం అనలేదు..అలాగే సీతా తానేమి త్యాగం చేసిందనుకోలేదు, కష్టం వోష్టే ఏడ్చారు.. సుఖం వొస్తే నవ్వారు.అంతే తప్ప తామేదో గొప్ప త్యాగం చేసాం అని చెప్పలేదు. బుద్దుడు ఇల్లొదిలి పోతే అతను గాని..ఇంకెవరు గాని దాన్ని త్యాగం అనలేదు.. ఈ నాడు మనం ఓహో ఎంత త్యాగం! అంటాం.
మనకి కనపడే ఈ మానవ జీవితం లోంచి కొన్ని సూత్రాల్ని అర్థాల్ని లాగటానికి చేసే ప్రయత్నం వల్ల వొచ్చింది ఈ ఘోరం. మన పూర్వులు సూత్రాల్ని లాగారు.కాని వాటిని జీవితానుషణం లోకి తీసుకు రావటానికి  గట్టి ప్రయత్నాలు చెయ్యలేదు.
సైన్సు అంటే కనపడే దంతోంచి సూత్రాల్ని లాగటం. పశ్చిమ దేశాల్లో సైన్సు సైన్సు లా ఉండకుండా మనషుల మనసుల్ని ..నమ్మకాల్ని  మతాన్ని రాజ్యాంగ విధానాన్ని పరిపాలించాతానికి పూనుకుంది.  థాట్ ని సంగం మీదకు తెచ్చి ఉన్న వ్యవస్థని మార్చటానికి కుల త్రోయ్యతానికి ప్రయత్నించినప్పుడే తగాదా.
త్యాగామనేది త్యాగమని తెలియకుండా జరగాలి.

Monday, 14 February, 2011

కొత్త తరగతి స్త్రీలు.
 
అసలు సంసార సుఖం చాలక  నరాలు ఎండి    అర్థం కాని బాధ బయలు దేరి తెంపెర్ పాడయ్యి చుట్టుపక్కల వారిని హింస పెడుతూ జెలసీ తో నీతి ఖండనలతో క్షోభ పడుతున్నారు చాల మంది నవీన స్త్రీలు.
ముఖ్యంగా ఇపుడు స్కూళ్ళల్లో/ కాలేజీల్లో/ ఉద్యోగాల్లో  ఉన్న   ఆడవాళ్ళు మరీ అన్యాయం. నేర్చుకునే/ నేర్చుకున్న  చదువు కొత్తది.. మగా  వాళ్ళతో  కలుస్తారు. కాని నేర్చుకున్న నీతులు పాతవి. మొగవాళ్ళని  తాకనియ్యరు. ( రహస్యంగా కొందరు తాకనిస్తారు..కాని ఆ దొంగతనం ఆ భయం ఆరోగ్యాన్ని తినేస్తాయి.) సహజ వాంఛలతో నిండిన మనసు ఆ కామానికి దగ్గరిగా ఉన్నా మొగవాళ్ళ ఆరోపిస్తుంది. కలహాలు, తమ తాహతును, విద్యని మరిచి సామాన్య స్త్రీలవలె  భర్త హస్తాల్లో సహితం శాంతిని పొందలేరు. అసంతుష్టి.  చాలామంది ఇదివరకు స్త్రీ పురుషుదు ఎంతసేపు సెక్స్ గురించే ఆలోచిస్తాడనీ  తాము పురుషుడు లేకుండా లోబడకుండా బ్రతుకుదామనీ ప్రయత్నించి ఏనాడో ఇంద్రియాలు తిరగాబడగా ఏ  గుమాస్తకో..  జవానుకో దక్కుతారు  ఈ దుర్గతి లో పడ్డవాళ్ళు  ముఖ్యం ఆడ టీచర్లు.. డాక్టర్లు .నర్సులు.. వల్ల ఉద్యోగ రీత్యా పురుషులతో కలిసి తిరగటానికి వీలు ఉంది.స్కాన్డల్స్   లేకుండా వీరు ఇప్పుడు బయలు దేరుతున్న కొత్త తరగతి స్త్రీలు.

Friday, 4 February, 2011

స్త్రీ
 స్త్రీలను గౌరవించమని ప్రతివాడు గోలపెడతాడు.. అగౌరవం అంటే కోరటం  అని అర్థం.గౌరవం పొందటం అతి సులభం..ఓ నలబై ఏళ్ళు గడిచి మీ సౌదర్యం మాసిపోగానే అత్యంత గౌరవం పొందుతారు. ప్రతివాడు గౌరవిస్తాడు..ఒక్కడూ కోరడు.