Wednesday 9 March, 2011

అది చలం

చలంగారి రచనలు సమాజం..స్త్రీ, మనిషి.. జీవితం, స్వేచ్ఛ వీటన్నింటి మీద .. ఒక దృక్పథం కలిగిస్తాయి.. అవొక ఆలోచన ..ఒక మేలుకొలుపు .. ఒక తత్వం ..
ప్రకృతిలో మమేకమై ..ప్రేమించి ..ఆరాధించి.. ఆ అమృతాన్ని తన అక్షరాల్లో నింపిన మహానుభావుడు చలం.తనలోకి తాను చూసుకొన్న ఒక తపస్వి ఆయన.
ఇదుగో, ఇది సమాజం..ఇది నీవు..ఇది స్త్రీ..ఇది మనం కొలిచే దేవుడు..ఇది..ప్రకృతి..ఇది ఆనందం...అంటూ చెయ్యిపట్టుకొని చూపిస్తాడు చలం.
ఒక స్త్రీకి తన గురించి తనకే తెలీదు.తను ఎందుకలా ప్రవర్తిస్తుందో, ఎం కోరుకుంటుందో, ఎం కోల్పోతుందో... వీటిని గూర్చి రాసాడు చలం.

చాలా మందికి చలం కథల్లో ఎంత సేపూ అక్రమ సంభంధాలు..కామం..కనపడి అవొక బూతు కథలుగా కనపడతాయి. కాని
* "సౌఖ్య మివ్వడానికి ధనము ఆస్తి ముఖ్యమనుకున్నంత కాలం ఇంకా ఏ విలువకీ స్ట్లముండదు మనుషుల మనస్సులో , తనను సృష్టించిన మన్ను తోటి, తన కళ్ళు తెరిచిన కాంతి తోనూ సంభందానికి దూరమవుతున్నాడు మనిషి.

" ఈ నాడు ఈ దేశం లో ఎలాగైనా ధనం సంపాదించే మార్గమే ధర్మ మార్గమైంది.
డబ్బు పేరు సంపాదించిన స్త్రీలు తమ సంసారమెట్ల ఉన్నాసరే సంఘంలో యోగ్యులైనారు.

తెల్లారి లేస్తే ఉరుకులు, పరుగులు, ఉద్యోగాలు డబ్బులు , ఇవ్వన్నీ వదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే మనో వ్యవధి, పువ్వులనుంచి, ఆవులనించి, అతితులనించి, ఇతలురాల్ ఆకలి తీర్చడం నుంచి వచ్చే సంతోషం ఉత్సాహం, శాంతి ఎప్పుడు కలుగుతుందో ఈ మానవులకి."
" ధనాలు అధికారాలు సంపాదించిన వారు కొద్దిమందే. కాని ప్రతి వాడికి దాని మీదే మోజు అదే ప్రయత్నం. అందరికి సుఖాలే ముఖ్యం. మానవుడి మీద ప్రేమా , మానవోద్దరణ అంటే , ప్రతి వాడికి కారు, టెలివిజన్ సప్లై చేయటమని అర్థం.. ధనం తో దురవస్థలో పడే వారు కొద్ది మంది. అది లేదే దాన్ని ఎట్లా సంపాదిద్దామా అని పగ పొందే వారు వేలకువేలు. ధనం వుండనీ, వుండకపోనీ, ప్రతి వారి ద్రుష్టి దాని మీదే .. ప్రతి వారి ఆశా , ఆశయము ధనమే. "
బూతు కథలు రాసే వ్యక్తే నా ఇలా రాయకలిగేది?? 

ఒక మనిషి దేని గురించైనా  చెప్పాలంటే.. అందులో మమేకం కావాలి..
"ఎటు చూసినా నీలపు ఆకాశం, కొండలు, పచ్చని చెట్లు,, ఆకాశం కేసి చేతులు చాచే మైదానాలు.."
"ఆరు బయట చక్కని బంగారపు ఎండలో తళతళ లాడే ఏటి చల్లని నీళ్ళు.. తెల్లని ఇసిక... చిన్ని అలలు నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడటం, తమాషా రంగుల పిట్టలు వచ్చి తొంగి చూసి , చిన్ని చిన్ని పలుకులు ఈలలు ,, ఆ ఆకుల గుహల్లోంచి పలికేవి.ఆ పక్షి రెక్కలోంచి ఒక ఈకే నామెడ వచ్చి వాలేది సోమరిగా, "
"ఆ పిట్టలన్ని నాకు గుర్తు, ప్రతి మధ్యాన్నం ఎదురు చూసేదాన్ని వాటికోసం, వాటికీ నాకు ఏదో భందుత్వం ఉన్నట్టు తోచేది. కొంగల బారు నా తల మేడనుండి వెడుతూ నా ఒంటరి తన్నాన్ని గుర్తు చేసింది..."

ఇలా రాసుకుంటూ పొతే లెక్కలేనన్ని...ఇవన్ని ఏదో గాలి వాటానికి వచ్చే కవిత్వం కాదు..అల్సలిది కవిత్వమే కాదు... ఆ సునిశిత ద్రుష్టి ఎలా కలుగుతుందంటే .. ప్రకృతిలో జీవించి.. అనుభవించి..ఆస్వాదించి ..అనుభూతి చెందటం వల్ల. దానిలో మమేకం కావటం వల్ల. తన ఆనందాన్ని అనుభవాన్ని అంతా  రాతల్లోకి దోల్లించాడు.

* ప్రకృతిని ప్రేమించి ప్రకృతిలో జీవించి ...ఒక మహర్షి లాగా బ్రతికాడు.... అది చలం.
చలంగారూ నాస్తిక రచయితకాదండీ. పురాణల్లో, పుస్తకాల్లో ఉన్న దేవుళ్లని, ఆ పాతివ్రత్యాన్ని అందులో ఉన్న చెత్తా చెదారాన్ని దుయ్యబట్టాడు. కానీ ఎప్పుడూ ఈశ్వరుడు ఉంటే.. అనే ధ్యాసలో గడిపాడు. వీళ్లు రాసిన దాంటో ఆయనకి సమన్వయం కుదరలెదు తప్ప నాస్తికుడు కాదు. ఆ ఈశ్వరాన్వేషణలో బతికాడు.
* రమణ మహర్శి వేరు.. వివేకానంద వేరు. రమణమహర్షిని ఒప్పుకుంటే వివేకానందుడిని ఒప్పుకున్నట్టు కాదు. చలం ఏ రాతలు రాసినా మనసులో ఓ మూల సత్యాన్వేషణ .. ఈశ్వరాన్వేషణ కలిగిఉన్నాడు. అందుకే ఆ అన్వేషణలో భాగంగానే రమణమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకి కలిగిన అనుభవాలు..అనుభూతులు చెప్పాడు. ఆ ఒక్క విషయాన్ని తీసుకొని చలం ఏదో "మన " దారిలోకొచ్చాడు అని ఫీల్ అయితే లాభం లేదు. ఊరికే ఈశ్వరుడున్నాడు అని ఒప్పుకొని..లోకంలో పడి తమ పనుల్లో ..పాపకార్యాల్లో పడి బతికే వాళ్ళు వేరు. ఉన్నాడా అనె సంశయంతో ఆ అన్వేషణలో బతికి విషయాన్ని కొంతవరకు రియలైజ్ కావటమ్ వేరు. 

No comments: