Tuesday 15 February, 2011

త్యాగం


శ్రీరాముడు అడవికి పోతే దానిని ధర్మం అన్నారు, త్యాగం అనలేదు..అలాగే సీతా తానేమి త్యాగం చేసిందనుకోలేదు, కష్టం వోష్టే ఏడ్చారు.. సుఖం వొస్తే నవ్వారు.అంతే తప్ప తామేదో గొప్ప త్యాగం చేసాం అని చెప్పలేదు. బుద్దుడు ఇల్లొదిలి పోతే అతను గాని..ఇంకెవరు గాని దాన్ని త్యాగం అనలేదు.. ఈ నాడు మనం ఓహో ఎంత త్యాగం! అంటాం.
మనకి కనపడే ఈ మానవ జీవితం లోంచి కొన్ని సూత్రాల్ని అర్థాల్ని లాగటానికి చేసే ప్రయత్నం వల్ల వొచ్చింది ఈ ఘోరం. మన పూర్వులు సూత్రాల్ని లాగారు.కాని వాటిని జీవితానుషణం లోకి తీసుకు రావటానికి  గట్టి ప్రయత్నాలు చెయ్యలేదు.
సైన్సు అంటే కనపడే దంతోంచి సూత్రాల్ని లాగటం. పశ్చిమ దేశాల్లో సైన్సు సైన్సు లా ఉండకుండా మనషుల మనసుల్ని ..నమ్మకాల్ని  మతాన్ని రాజ్యాంగ విధానాన్ని పరిపాలించాతానికి పూనుకుంది.  థాట్ ని సంగం మీదకు తెచ్చి ఉన్న వ్యవస్థని మార్చటానికి కుల త్రోయ్యతానికి ప్రయత్నించినప్పుడే తగాదా.
త్యాగామనేది త్యాగమని తెలియకుండా జరగాలి.

No comments: