Thursday 11 December, 2008

మనం వివేకవంతులం ఐతే

"ప్రపంచం అంతా ఆనందం పొంగి పొర్లుతూ ఉంది .దాన్ని అందుకో కలిగిన హృదయాలు ఉండాలి.ప్రతి జీవికీ కొంత శక్తి ఉంది.కొంత సమయం ఉంది ఈ శక్తిని కాలాన్నీ ఆనందంలో మార్చుకొనే తెలివితేటలు లేవు. మనం వివేకవంతులం ఐతే మన శక్తినంతా ఆనందంగా మార్చుకోగలం. మన కాలాన్ని మనకి ఆనందాన్ని ఇచ్చేలా చేయగలం. ఈ శక్తి పుట్టుక వల్లా, సంస్కారం వల్లా, అలవాట్ల వల్లా, మనకి మనం ఇచ్చు కునే శిక్షణ వల్లా కలుగుతుంది.
ఎవరు చెప్పినా వినకుండా తన స్వభావాన్ని ఇన్ స్టింక్ట్ ని నమ్ముకుంటే ఎ మనిషికి ఏది తనకి ఆనందమో అర్థం అవుతుంది. భాదని ఎదురించి పోరాడితే చాలావరకు లొంగుతుంది.కాని ఆ జ్ఞానము కొద్ది మందికే ఉంది.లోకం సౌందర్యాన్ని కల్పిస్తుంది కానీ అనుభవించమని బలవంత పెట్టగలదా?? అట్లానే జీవితం కష్టాలని కల్పిస్తుంది కానీ అనుభవించమని బలవంత పెట్టలేదు."

No comments: