" అసలు దేవుడున్నడనటమే మూర్ఖం "
తనలోకి తాను చూసుకొన్న తపస్వి చలం. ఆయన తత్వాన్ని,ఆలోచనలను,అభిప్రాయాలను, పంచుకునే వెదికే ఈ బ్లాగ్ .
Friday, 1 July 2011
Thursday, 12 May 2011
ఒక్కటే సాధనం
ఒక్కటే సాధనం.. సాహసం.
" జీవితం లో విశ్వాసం. మూడత్వం మీద ...కర్మ మీద..శాసనం మీద తిరుగుబాటు..
భవిష్యత్తు మీద నిర్భయం.. ఆత్మలో దైర్యం...పర్యవసానాల మీద నిర్లక్షం ""
- చలం.
" జీవితం లో విశ్వాసం. మూడత్వం మీద ...కర్మ మీద..శాసనం మీద తిరుగుబాటు..
భవిష్యత్తు మీద నిర్భయం.. ఆత్మలో దైర్యం...పర్యవసానాల మీద నిర్లక్షం ""
- చలం.
Thursday, 31 March 2011
ఏ ఆశలేదు
ఈ ప్రపంచంతో సమన్వయం నాకు కుదరలేదు. ఇప్పాటికీ కుదరలేదు..ఎప్పటికీ కుదరదేమో మరి. ఈశ్వరుడు ప్రత్యక్షమై సత్య దర్శనం అయితే అప్పుడిదంతా అర్ధమవుతుందంటారు. కాని నాకు అట్టాటిది ఏ ఆశలేదు. - చలం
Wednesday, 9 March 2011
అది చలం
చలంగారి రచనలు సమాజం..స్త్రీ, మనిషి.. జీవితం, స్వేచ్ఛ వీటన్నింటి మీద .. ఒక దృక్పథం కలిగిస్తాయి.. అవొక ఆలోచన ..ఒక మేలుకొలుపు .. ఒక తత్వం ..
ప్రకృతిలో మమేకమై ..ప్రేమించి ..ఆరాధించి.. ఆ అమృతాన్ని తన అక్షరాల్లో నింపిన మహానుభావుడు చలం.తనలోకి తాను చూసుకొన్న ఒక తపస్వి ఆయన.
ఇదుగో, ఇది సమాజం..ఇది నీవు..ఇది స్త్రీ..ఇది మనం కొలిచే దేవుడు..ఇది..ప్రకృతి..ఇది ఆనందం...అంటూ చెయ్యిపట్టుకొని చూపిస్తాడు చలం.
ఒక స్త్రీకి తన గురించి తనకే తెలీదు.తను ఎందుకలా ప్రవర్తిస్తుందో, ఎం కోరుకుంటుందో, ఎం కోల్పోతుందో... వీటిని గూర్చి రాసాడు చలం.
చాలా మందికి చలం కథల్లో ఎంత సేపూ అక్రమ సంభంధాలు..కామం..కనపడి అవొక బూతు కథలుగా కనపడతాయి. కాని
* "సౌఖ్య మివ్వడానికి ధనము ఆస్తి ముఖ్యమనుకున్నంత కాలం ఇంకా ఏ విలువకీ స్ట్లముండదు మనుషుల మనస్సులో , తనను సృష్టించిన మన్ను తోటి, తన కళ్ళు తెరిచిన కాంతి తోనూ సంభందానికి దూరమవుతున్నాడు మనిషి.
" ఈ నాడు ఈ దేశం లో ఎలాగైనా ధనం సంపాదించే మార్గమే ధర్మ మార్గమైంది.
డబ్బు పేరు సంపాదించిన స్త్రీలు తమ సంసారమెట్ల ఉన్నాసరే సంఘంలో యోగ్యులైనారు.
ఒక మనిషి దేని గురించైనా చెప్పాలంటే.. అందులో మమేకం కావాలి..
"ఎటు చూసినా నీలపు ఆకాశం, కొండలు, పచ్చని చెట్లు,, ఆకాశం కేసి చేతులు చాచే మైదానాలు.."
"ఆరు బయట చక్కని బంగారపు ఎండలో తళతళ లాడే ఏటి చల్లని నీళ్ళు.. తెల్లని ఇసిక... చిన్ని అలలు నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడటం, తమాషా రంగుల పిట్టలు వచ్చి తొంగి చూసి , చిన్ని చిన్ని పలుకులు ఈలలు ,, ఆ ఆకుల గుహల్లోంచి పలికేవి.ఆ పక్షి రెక్కలోంచి ఒక ఈకే నామెడ వచ్చి వాలేది సోమరిగా, "
"ఆ పిట్టలన్ని నాకు గుర్తు, ప్రతి మధ్యాన్నం ఎదురు చూసేదాన్ని వాటికోసం, వాటికీ నాకు ఏదో భందుత్వం ఉన్నట్టు తోచేది. కొంగల బారు నా తల మేడనుండి వెడుతూ నా ఒంటరి తన్నాన్ని గుర్తు చేసింది..."
ఇలా రాసుకుంటూ పొతే లెక్కలేనన్ని...ఇవన్ని ఏదో గాలి వాటానికి వచ్చే కవిత్వం కాదు..అల్సలిది కవిత్వమే కాదు... ఆ సునిశిత ద్రుష్టి ఎలా కలుగుతుందంటే .. ప్రకృతిలో జీవించి.. అనుభవించి..ఆస్వాదించి ..అనుభూతి చెందటం వల్ల. దానిలో మమేకం కావటం వల్ల. తన ఆనందాన్ని అనుభవాన్ని అంతా రాతల్లోకి దోల్లించాడు.

తెల్లారి లేస్తే ఉరుకులు, పరుగులు, ఉద్యోగాలు డబ్బులు , ఇవ్వన్నీ వదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే మనో వ్యవధి, పువ్వులనుంచి, ఆవులనించి, అతితులనించి, ఇతలురాల్ ఆకలి తీర్చడం నుంచి వచ్చే సంతోషం ఉత్సాహం, శాంతి ఎప్పుడు కలుగుతుందో ఈ మానవులకి."
" ధనాలు అధికారాలు సంపాదించిన వారు కొద్దిమందే. కాని ప్రతి వాడికి దాని మీదే మోజు అదే ప్రయత్నం. అందరికి సుఖాలే ముఖ్యం. మానవుడి మీద ప్రేమా , మానవోద్దరణ అంటే , ప్రతి వాడికి కారు, టెలివిజన్ సప్లై చేయటమని అర్థం.. ధనం తో దురవస్థలో పడే వారు కొద్ది మంది. అది లేదే దాన్ని ఎట్లా సంపాదిద్దామా అని పగ పొందే వారు వేలకువేలు. ధనం వుండనీ, వుండకపోనీ, ప్రతి వారి ద్రుష్టి దాని మీదే .. ప్రతి వారి ఆశా , ఆశయము ధనమే. "
బూతు కథలు రాసే వ్యక్తే నా ఇలా రాయకలిగేది?? ఒక మనిషి దేని గురించైనా చెప్పాలంటే.. అందులో మమేకం కావాలి..
"ఎటు చూసినా నీలపు ఆకాశం, కొండలు, పచ్చని చెట్లు,, ఆకాశం కేసి చేతులు చాచే మైదానాలు.."
"ఆరు బయట చక్కని బంగారపు ఎండలో తళతళ లాడే ఏటి చల్లని నీళ్ళు.. తెల్లని ఇసిక... చిన్ని అలలు నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడటం, తమాషా రంగుల పిట్టలు వచ్చి తొంగి చూసి , చిన్ని చిన్ని పలుకులు ఈలలు ,, ఆ ఆకుల గుహల్లోంచి పలికేవి.ఆ పక్షి రెక్కలోంచి ఒక ఈకే నామెడ వచ్చి వాలేది సోమరిగా, "
"ఆ పిట్టలన్ని నాకు గుర్తు, ప్రతి మధ్యాన్నం ఎదురు చూసేదాన్ని వాటికోసం, వాటికీ నాకు ఏదో భందుత్వం ఉన్నట్టు తోచేది. కొంగల బారు నా తల మేడనుండి వెడుతూ నా ఒంటరి తన్నాన్ని గుర్తు చేసింది..."
ఇలా రాసుకుంటూ పొతే లెక్కలేనన్ని...ఇవన్ని ఏదో గాలి వాటానికి వచ్చే కవిత్వం కాదు..అల్సలిది కవిత్వమే కాదు... ఆ సునిశిత ద్రుష్టి ఎలా కలుగుతుందంటే .. ప్రకృతిలో జీవించి.. అనుభవించి..ఆస్వాదించి ..అనుభూతి చెందటం వల్ల. దానిలో మమేకం కావటం వల్ల. తన ఆనందాన్ని అనుభవాన్ని అంతా రాతల్లోకి దోల్లించాడు.
* ప్రకృతిని ప్రేమించి ప్రకృతిలో జీవించి ...ఒక మహర్షి లాగా బ్రతికాడు.... అది చలం.
చలంగారూ నాస్తిక రచయితకాదండీ. పురాణల్లో, పుస్తకాల్లో ఉన్న దేవుళ్లని, ఆ పాతివ్రత్యాన్ని అందులో ఉన్న చెత్తా చెదారాన్ని దుయ్యబట్టాడు. కానీ ఎప్పుడూ ఈశ్వరుడు ఉంటే.. అనే ధ్యాసలో గడిపాడు. వీళ్లు రాసిన దాంటో ఆయనకి సమన్వయం కుదరలెదు తప్ప నాస్తికుడు కాదు. ఆ ఈశ్వరాన్వేషణలో బతికాడు.
* రమణ మహర్శి వేరు.. వివేకానంద వేరు. రమణమహర్షిని ఒప్పుకుంటే వివేకానందుడిని ఒప్పుకున్నట్టు కాదు. చలం ఏ రాతలు రాసినా మనసులో ఓ మూల సత్యాన్వేషణ .. ఈశ్వరాన్వేషణ కలిగిఉన్నాడు. అందుకే ఆ అన్వేషణలో భాగంగానే రమణమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకి కలిగిన అనుభవాలు..అనుభూతులు చెప్పాడు. ఆ ఒక్క విషయాన్ని తీసుకొని చలం ఏదో "మన " దారిలోకొచ్చాడు అని ఫీల్ అయితే లాభం లేదు. ఊరికే ఈశ్వరుడున్నాడు అని ఒప్పుకొని..లోకంలో పడి తమ పనుల్లో ..పాపకార్యాల్లో పడి బతికే వాళ్ళు వేరు. ఉన్నాడా అనె సంశయంతో ఆ అన్వేషణలో బతికి విషయాన్ని కొంతవరకు రియలైజ్ కావటమ్ వేరు.

Friday, 18 February 2011
ప్రపంచం సౌందర్యమయం
ఒక్కొక్క జ్ఞానేన్ద్రియాన్ని మేల్కొలిపి..రంగులతో, స్వరాలతో రుచులతో, పరిమలాలతో ముదు స్పర్శలతో, అభిరుచులతో,కళలతో, ప్రేమతో,సంతోషంతో, భావోద్రేకాలతో.. రక రకాల ఆనంద పెట్టాలని చూస్తుంది. తనని తన సౌందర్యాన్ని చూసి అనుభవించి సుఖించమని, బ్రతిమిలాడి పిలుస్తున్నట్టు నిద్ర నిచి, మత్తు నుంచి లేపి ఎదురవుతుంది. ఆకలేస్తే భోజనం అడుగుతాము, దాంటో రుచిని కలిపింది. కామం తీర్చుకోవాలని బుద్ది పుడితే దాంటో ప్రేమనీ, అందాన్ని చేర్చింది.
తోవ కనపడితే చాలు అనుకుంటే పక్కనే చెట్లని పువ్వుల్నీ పెట్టింది.గొంతుకలో మర్ధవాలు, రుచులలో పరిమళాలు, ఆకాశంలో లో నునుపు, గాలిలో మృదుత్వం, వెన్నెలలోని నిర్మలత్వం నీళ్ళలోని చల్లదనం అన్నీ. నత్త గుళ్ళలో, గడ్డి పువ్వుల్లో, కీటకాల నడకల్లో, పక్షి రెక్కల వొంపుల్లో సౌందర్యాన్ని ఊరికే గుమ్మరిస్తుంది.
పుట్టినప్పటినుండి ప్రతి జీవిని, ఏ లోకం తన వొళ్లోకి తీసుకొని సుఖపెట్టాలని చూస్తుంది. పిల్లలకి సదుపాయం చేయటం కోసమై తల్లి హృదయంలో ప్రేమ, స్థనంలో పాలు, అ పాలలో మాధుర్యము, తోడల్లో మెత్తదనము, పొట్టలో ఆకలి, నోటిలో రుచి ఇవన్నీ ఏర్పరుస్తుంది సృష్టి
Tuesday, 15 February 2011
త్యాగం
శ్రీరాముడు అడవికి పోతే దానిని ధర్మం అన్నారు, త్యాగం అనలేదు..అలాగే సీతా తానేమి త్యాగం చేసిందనుకోలేదు, కష్టం వోష్టే ఏడ్చారు.. సుఖం వొస్తే నవ్వారు.అంతే తప్ప తామేదో గొప్ప త్యాగం చేసాం అని చెప్పలేదు. బుద్దుడు ఇల్లొదిలి పోతే అతను గాని..ఇంకెవరు గాని దాన్ని త్యాగం అనలేదు.. ఈ నాడు మనం ఓహో ఎంత త్యాగం! అంటాం.
మనకి కనపడే ఈ మానవ జీవితం లోంచి కొన్ని సూత్రాల్ని అర్థాల్ని లాగటానికి చేసే ప్రయత్నం వల్ల వొచ్చింది ఈ ఘోరం. మన పూర్వులు సూత్రాల్ని లాగారు.కాని వాటిని జీవితానుషణం లోకి తీసుకు రావటానికి గట్టి ప్రయత్నాలు చెయ్యలేదు.
సైన్సు అంటే కనపడే దంతోంచి సూత్రాల్ని లాగటం. పశ్చిమ దేశాల్లో సైన్సు సైన్సు లా ఉండకుండా మనషుల మనసుల్ని ..నమ్మకాల్ని మతాన్ని రాజ్యాంగ విధానాన్ని పరిపాలించాతానికి పూనుకుంది. థాట్ ని సంగం మీదకు తెచ్చి ఉన్న వ్యవస్థని మార్చటానికి కుల త్రోయ్యతానికి ప్రయత్నించినప్పుడే తగాదా.
త్యాగామనేది త్యాగమని తెలియకుండా జరగాలి.
Monday, 14 February 2011
కొత్త తరగతి స్త్రీలు.
అసలు సంసార సుఖం చాలక నరాలు ఎండి అర్థం కాని బాధ బయలు దేరి తెంపెర్ పాడయ్యి చుట్టుపక్కల వారిని హింస పెడుతూ జెలసీ తో నీతి ఖండనలతో క్షోభ పడుతున్నారు చాల మంది నవీన స్త్రీలు.
ముఖ్యంగా ఇపుడు స్కూళ్ళల్లో/ కాలేజీల్లో/ ఉద్యోగాల్లో ఉన్న ఆడవాళ్ళు మరీ అన్యాయం. నేర్చుకునే/ నేర్చుకున్న చదువు కొత్తది.. మగా వాళ్ళతో కలుస్తారు. కాని నేర్చుకున్న నీతులు పాతవి. మొగవాళ్ళని తాకనియ్యరు. ( రహస్యంగా కొందరు తాకనిస్తారు..కాని ఆ దొంగతనం ఆ భయం ఆరోగ్యాన్ని తినేస్తాయి.) సహజ వాంఛలతో నిండిన మనసు ఆ కామానికి దగ్గరిగా ఉన్నా మొగవాళ్ళ ఆరోపిస్తుంది. కలహాలు, తమ తాహతును, విద్యని మరిచి సామాన్య స్త్రీలవలె భర్త హస్తాల్లో సహితం శాంతిని పొందలేరు. అసంతుష్టి. చాలామంది ఇదివరకు స్త్రీ పురుషుదు ఎంతసేపు సెక్స్ గురించే ఆలోచిస్తాడనీ తాము పురుషుడు లేకుండా లోబడకుండా బ్రతుకుదామనీ ప్రయత్నించి ఏనాడో ఇంద్రియాలు తిరగాబడగా ఏ గుమాస్తకో.. జవానుకో దక్కుతారు ఈ దుర్గతి లో పడ్డవాళ్ళు ముఖ్యం ఆడ టీచర్లు.. డాక్టర్లు .నర్సులు.. వల్ల ఉద్యోగ రీత్యా పురుషులతో కలిసి తిరగటానికి వీలు ఉంది.స్కాన్డల్స్ లేకుండా వీరు ఇప్పుడు బయలు దేరుతున్న కొత్త తరగతి స్త్రీలు.
Friday, 4 February 2011
Friday, 9 July 2010
దైవానికి ఒక బుద్ధి , ఒక న్యాయమూ , విచక్షణా ఉన్నాయేమో అన్న సందేహమన్నా రాదు.
సంస్కారమంటే ఈనాడు డబ్బు సంస్కారం తప్ప ఇంకోటి లేదు , తనకో ఆత్మ ఉందని మరిచి పోయినాడు మానవుడు. struggle for existance. ప్రకృతిలో- చెట్లలో- కీటకాలలో ఎట్లా ఉంది అంటారో అదే మనుషుల్లో ఈనాడు. వాటికి శాంతి ఉంది అది లేదు మానవుడికి.
ధనాలు అధికారాలు సంపాదించిన వారు కొద్దిమందే. కాని ప్రతి వాడికి దాని మీదే మోజు అదే ప్రయత్నం. అందరికి సుఖాలే ముఖ్యం. మానవుడి మీద ప్రేమా , మానవోద్దరణ అంటే , ప్రతి వాడికి కారు, టెలివిజన్ సప్లై చేయటమని అర్థం.. ధనం తో దురవస్థలో పడే వారు కొద్ది మంది. అది లేదే దాన్ని ఎట్లా సంపాదిద్దామా అని పగ పొందే వారు వేలకువేలు. ధనం వుండనీ, వుండకపోనీ, ప్రతి వారి ద్రుష్టి దాని మీదే .. ప్రతి వారి ఆశా , ఆశయము ధనమే.
సుఖమంటే, డాబు ఇతరులు తనని ఆశ్రఇంచడము తను అజ్ఞాపించడమూ,మిత్రులూ, కబుర్లూ,కోతలూ ఇవే చూసుకుంటాడు పైకి. కాని ఈ గొప్పల వెంట, చచ్చేపని , జాగ్రత్త, కుట్ర, ఇతరులని కూల్చడాలు , అబద్దాలు అన్ని ఇష్ట పడతాడు అందువల్లనే ఇంత అశాంతి పెరగడం. ఎందుకైనా మంచిదని తనకి సహాయం చేయటం కోసం పూజలు చేయిస్తాడు. పడిపోయేట్టు ఉన్న దేవుడిని తలచుకొంటాడు. తిరపతికి పోతూ ఉంటాడు. దైవాన్ని తన వైపు చేర్చు కుంటాడు దైవానికి ఒక బుద్ధి , ఒక న్యాయమూ , విచక్షణా ఉన్నాయేమో అన్న సందేహమన్నా రాదు.
ఇంకా మొక్కులతో సాధిస్తాడు , దురదృష్టం వచ్చేటట్టు కనపడిందా! " నన్ను నిలబెదితివా నేను వంద రూపాయలిస్తాను, తిరపతి వెంకటేశ్వరా! నాకు లక్ష ఇవ్వు .. నీకు వెయ్యి ఇస్తాను. నీకు నగ చేయిస్తాను. నీ గుడి చుట్టు పొల్లిగింతలు పెడతాను " అంటాడు.
ఈ బెరాలకి ఈశ్వరుడు ఒప్పుకుంటాడనే భ్రమ. భక్తి అనేది ఏ koshaanaa లేదు..ఉట్టి బేరాలు. ఈశ్వరుణ్ణి కూడా టోపీ వేద్దామనే, ఈమ ఘోరాలు చేస్తేనేం , ఆ దేవుడి మొహాన డబ్బో , జుత్తో , సంతర్పనో సహస్రనామార్చానో కొడితే సరి!

bitch goddess of success
మనిషి , ఈశ్వరున్ని తొలగించి దానిపై bitch goddess of success ని ప్రతిష్టించి ఆమె ముందు తమ లోని ఉన్నతమైన విలువలని నిత్యము బలి సమర్పణ చేస్తున్నాడు "
ధనం పోగు చేసుకోడము, దాంతో తిండినీ, స్త్రీ ని కొని అనుభవించడము, తన సోదరులపై అధికారము ఆశయం గా పెట్టుకొని, ఎన్ని పై పై ఆడంబరాలు మోస్తే అంత ఘనత .
ధనం పోగు చేసుకోడము, దాంతో తిండినీ, స్త్రీ ని కొని అనుభవించడము, తన సోదరులపై అధికారము ఆశయం గా పెట్టుకొని, ఎన్ని పై పై ఆడంబరాలు మోస్తే అంత ఘనత .
Sunday, 30 May 2010
నవీన స్త్రీ
అత్త అధికారం నుంచి, భర్త అధీనం నుంచి తప్పించుకున్న నవీన స్త్రీ , షోకులకీ, సంఘ గౌరవానికీ, ఫాషన్ కి బానిస అవుతోంది. ఒక పురుషుడి నీడ కింద నిల్చొని ( ఆ పురుషుడికి బానిస అయితేనేం గాక ) లోకాన్ని దిక్కరించగలిగే ఇల్లాలు, ఈనాడు సంఘ గౌరవం పేర, విద్య ఉద్యోగం పేర,ఫాషన్ పేర, వెయ్యి మందికి దాస్యం చేస్తోంది.. నవీన స్త్రీకి తన చుట్టూ ఉన్న స్త్రీలందరూ అత్తలైనారు..
Thursday, 11 December 2008
ఈ నాడు ఈ దేశం లో...
ఈ నాడు ఈ దేశం లో ఎలాగైనా ధనం సంపాదించే మార్గమే ధర్మ మార్గమైంది.
డబ్బు పేరు సంపాదించిన స్త్రీలు తమ సంసారమెట్ల ఉన్నాసరే సంఘంలో యోగ్యులైనారు.
తెల్లారి లేస్తే ఉరుకులు, పరుగులు, ఉద్యోగాలు డబ్బులు , ఇవ్వన్నీ వదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే మనో వ్యవధి, పువ్వులనుంచి, ఆవులనించి, అతితులనించి, ఇతలురాల్ ఆకలి తీర్చడం నుంచి వచ్చే సంతోషం ఉత్సాహం, శాంతి ఎప్పుడు కలుగుతుందో ఈ మానవులకి.. -chalam

మనిషి.
"సౌఖ్య మివ్వడానికి ధనము ఆస్తి ముఖ్యమనుకున్నంత కాలం ఇంకా ఏ విలువకీ స్ట్లముండదు మనుషుల మనస్సులో , తనను సృష్టించిన మన్ను తోటి, తన కళ్ళు తెరిచిన కాంతి తోనూ సంభందానికి దూరమవుతున్నాడు మనిషి."-chalam
వాటికీ నాకు ఏదో భందుత్వం

"ఎటు చూసినా నీలపు ఆకాశం, కొండలు, పచ్చని చెట్లు,, ఆకాశం కేసి చేతులు చాచే మైదానాలు.."
"ఆరు బయట చక్కని బంగారపు ఎండలో తళతళ లాడే ఏటి చల్లని నీళ్ళు.. తెల్లని ఇసిక... చిన్ని అలలు నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడటం, తమాషా రంగుల పిట్టలు వచ్చి తొంగి చూసి , చిన్ని చిన్ని పలుకులు ఈలలు ,, ఆ ఆకుల గుహల్లోంచి పలికేవి.ఆ పక్షి రెక్కలోంచి ఒక ఈకే నామీద వచ్చి వాలేది సోమరిగా, "
"ఆ పిట్టలన్ని నాకు గుర్తు, ప్రతి మధ్యాన్నం ఎదురు చూసేదాన్ని వాటికోసం, వాటికీ నాకు ఏదో భందుత్వం ఉన్నట్టు తోచేది. కొంగల బారు నా తల మీద నుండి వెడుతూ నా ఒంటరి తన్నాన్ని గుర్తు చేసింది..."- చలం
మనం వివేకవంతులం ఐతే
"ప్రపంచం అంతా ఆనందం పొంగి పొర్లుతూ ఉంది .దాన్ని అందుకో కలిగిన హృదయాలు ఉండాలి.ప్రతి జీవికీ కొంత శక్తి ఉంది.కొంత సమయం ఉంది ఈ శక్తిని కాలాన్నీ ఆనందంలో మార్చుకొనే తెలివితేటలు లేవు. మనం వివేకవంతులం ఐతే మన శక్తినంతా ఆనందంగా మార్చుకోగలం. మన కాలాన్ని మనకి ఆనందాన్ని ఇచ్చేలా చేయగలం. ఈ శక్తి పుట్టుక వల్లా, సంస్కారం వల్లా, అలవాట్ల వల్లా, మనకి మనం ఇచ్చు కునే శిక్షణ వల్లా కలుగుతుంది.
ఎవరు చెప్పినా వినకుండా తన స్వభావాన్ని ఇన్ స్టింక్ట్ ని నమ్ముకుంటే ఎ మనిషికి ఏది తనకి ఆనందమో అర్థం అవుతుంది. భాదని ఎదురించి పోరాడితే చాలావరకు లొంగుతుంది.కాని ఆ జ్ఞానము కొద్ది మందికే ఉంది.లోకం సౌందర్యాన్ని కల్పిస్తుంది కానీ అనుభవించమని బలవంత పెట్టగలదా?? అట్లానే జీవితం కష్టాలని కల్పిస్తుంది కానీ అనుభవించమని బలవంత పెట్టలేదు."

ఆనందం
తనకి బాధ కలిగించే పనులనుండి మన శరీరం తనంతట తనే తప్ప్పుకుంటుంది..
కానీ మనసుకి మాత్రం అ నేర్పు ఇంకా రాలేదు..తనకి ఏది అనడం ఇస్తుందో.. ఆ బాధల ఎట్లా నుంచి తప్పుకోగాలరో మనుషులు ఇంకా నేర్చుకోలేదు.కనకనే ఎవడు వచ్చి " ఆనందం " అని కేకలు వేసినా వాడి వెంట పరిగెత్తుతారు..
నాకు ఆనందం కావాలి ,, నేను ఆనందం అనుభవించాలి అని ప్రయత్నిస్తే ఆనందం వచ్చేట్టు కనపడదు..
ఒక కార్యం ద్వారానే కల్గుతుంది ఆనందం.. మనసు ఆ కార్యం మీదనే ఉండాలి కానీ ఆనందం మెడ ఉంటె ఆనందం చెదిరిపోతుంది..తీపి కావాలన్నా వాడు తీపి కోసం వెతికితే ఎక్కడన్నా కనపడుతుందా .. చెరుకు కోసం వెతకాలి కాని..
ఒక యోగి వచ్చి ఆసనం చుఇపగానే అందరు ఆసనాలు ప్రారంభిస్తారు.. ఇంకో పండితుడు వచ్చి జుట్లు కోరిగించ మనగానే అందరు జుట్లు గోరిగిస్తారు..
ఉద్యోగం చేస్తూ ఎన్నడు నవ్వని దురదృష్ట వంతుడు..ప్లేదరై కవుల వెంట తిరిగే రసికుడు.. పెళ్లి చేసుకొని నమ్మకంగా నిలువ లేని స్త్రీ ... ఇలా అందరూ తమ అనడమేదో తెలియని మూర్కులు..
తమకి లేని వొస్తువ తమకి ఆనందం ఇస్తున్డను కోవటం పెద్ద భ్రమ..
విరోధం సహజమే..!
"మనసు మారకుండా ఆత్మ అభివృద్ధి చెందకుండా ప్రపంచం అంటే అర్థం కాకుండానే ఏవో కొన్ని కర్మల వల్లా.. పూజల వల్లా యోగాల వల్లా దేవుడి దయ సంపాదించ వచ్చుననే నమ్మకం ఈ మనుషులకి.. ప్రపంచంలో ఈ గొప్ప విషయము అర్థం కాని ముర్ఖుడికి ఈశ్వర జ్ఞానం కల్గుతుందట.. ఈ దేశం చాల ఉన్నతమైన దని ఏ లోపాలు లేవని , ఈ ఆచారాలన్నీ చాల వివేకంతో స్థాపించినవనీ, అంతరార్థలున్నాయని కీర్తిస్తే .. మయజోల పాడి జో కొడితే చాల సంతోషం ఈ ప్రజలకి. ఇంకా ఆనందంగా, ఆరోగ్యంగా బ్రతకటానికి మార్గాలున్నయనీ చెపితే విరోధం సహజమే." -chalam
జీవితం స్వప్న మైతే ..!!
జీవితం స్వప్న మైతే , సుందరమైన స్వప్నాన్నే కందాం. ఈ దరిద్రం లోంచి ఈ భయం లోంచి మేలుకుందాం.- చలం
డబ్బు సంస్కారం
సంస్కారమంటే ...ఈనాడు డబ్బు సంస్కారం తప్ప ఇంకోటి లేదు , తనకో ఆత్మ ఉందని మరిచి పోయినాడు మానవుడు. struggle for existance. ప్రకృతిలో- చెట్లలో- కీటకాలలో ఎట్లా ఉంది అంటారో అదే మనుషుల్లో ఈనాడు. వాటికి శాంతి ఉంది అది లేదు మానవుడికి.- chalam
Subscribe to:
Posts (Atom)