మతమంటే మనసుకి కలిగే గొప్ప సందేహాలు తీర్చాలి , మన జీవనానికి నమ్మకానికి సమన్వయము కుదిరించాలి.లోకం లో కొత్త సమస్యలు బయలు దేరితే వాటిని అర్థం చెయ్యాలి. నుతనోస్థం ఇవ్వాలి జీవించడానికి. అంతే కాని ఏదో నేను చెపుతున్నాను , నమ్ము. నమ్మితే మోక్షం ,, నమ్మక పోతే నరకం.. నా పాణి పరలోకం ఈ లోకం తో పని లేదు అనే మతం ఎందుకు పనికి రాని మతం..
ఇన్ని ఆచారాలతో ఈశర నామాలతో ప్రతిమూలా మరుగుతో ఉండే ఈ దేశం లో ఈ పూజలు , మల్లు ముక్కులు ముసుకోదాలు , వేదాంతాలు మాట్లాడే వాళ్ళు. రుద్రస్కల వాలు.. విభూతుల వాళ్ళు..వీళ్ళని ప్రశ్నిస్తే ,, ఏదో శాస్త్రం .. అవతారం..కరం అని గొణగడం తప్పిస్తే ఈ సందేహాలు తీర్చరేం ..?? ఎందుకు ఈ ఆద్యాత్మికం ,, ఈ భజనలు భాష్యాలు భగవత్గీతలు అంత గోపా పుస్తకాలేమో వేళ్ళకి ఎవరికీ తెలిసినట్టు కనపడదు. మతానికి జీవితానికి ఈ సంభందం లేదు . దెయ్యాలు ఆత్మలు పరలోకం ఈశ్వరుడు కరం పాపం. పుణ్యం. ఇట్లాంటి విషయమై ఒక్కరికి నిష్టితాభిప్రాయం లేదు. -chalam
No comments:
Post a Comment